మా విజయానికి అభిమానులే కారణం: కోహ్లీ

by Shiva |   ( Updated:2021-02-16 09:50:23.0  )
మా విజయానికి అభిమానులే కారణం: కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడానికి అభిమానులే కారణమని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై కోహ్లీ సేన 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయం అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘కొత్తగా ఆడిన పిచ్‌పై బంతి టర్న్ అవుతున్నది. మేమే మొదట బ్యాటింగ్ చేశాము కాబట్టి.. బంతి ఎలా తిరుగుతున్నదో అంచనా వేయగలిగాము. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ముందుకు వెళ్లాము. రెండు ఇన్నింగ్స్ కలిపి దాదాపు 600 పరుగులు సాధించగలిగాము. అయితే సొంత గ్రౌండ్‌లో మన బౌలర్లు తమ ప్రతిభను చూపించారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా టర్న్ అవుతున్నదో మరింతగా గమనించాము. అందుకే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను సరిగా అంచనా వేయగలిగి అవుట్ చేశాము’ అని కోహ్లీ అన్నాడు. ఇక చెన్నైలో విజయానికి అభిమానుల తోడ్పాటే కారణం అని కోహ్లీ చెప్పాడు. ఏడాది తర్వాత అభిమానుల మధ్యలో ఆడటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని.. ముఖ్యంగా చెన్నై ప్రేక్షకుల తమకు చాలా సహకరించారిన కోహ్లీ అన్నాడు.

Advertisement

Next Story