- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్జరీతో అందవిహీనంగా తయారైన హీరోయిన్..
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కోయినా మిత్ర మోడల్‌గా కెరియర్ ప్రారంభించి ‘ముసాఫిర్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బీటౌన్‌లో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుని, స్టార్‌గా ఎదగాలనుకున్న ఈ హీరోయిన్.. మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అది కాస్తా ఫెయిల్ కావడంతో హెడ్ లైన్స్‌లోకి ఎక్కింది భామ. తాజాగా ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓపెన్ అయింది కోయిన. ప్రతీ ఒక్కరు ఏదో తప్పు జరిగిపోయిందని భావిస్తున్నారు గానీ, నిజానికి సర్జరీకి తన బాడీ రియాక్ట్ అయిన విధానం తప్పుగా ఉందని క్లారిటీ ఇచ్చింది. చాలా మంది ఒక విషయం గురించి ఎలాంటి అవగాహన లేకుండానే ముందుకు సాగుతారని, ఈ విషయంలో తాను కూడా అలాగే చేశానని తెలిపింది. రినోప్లాస్టీ అనేది పెద్ద విషయమేమీ కాదని, కేవలం నటులు మాత్రమే కాదు వివిధ రంగాలకు చెందినవారు కూడా చేయించుకుంటారని చెప్పింది.
ట్రీట్మెంట్‌కు ఒక్కో శరీరం ఒక్కో విధంగా స్పందించగలదని తెలిపిన ఆమె.. సర్జరీ తర్వాత తన ముఖం మీద ఎముకకు వాపు వచ్చిందని వెల్లడించింది. కాలు విరిగినప్పుడు ఎముకను సరిచేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని, ఆ సమయంలో వాపు, తిమ్మిర్లు రావడం జరుగుతుందన్న హీరోయిన్.. ఇలాంటి టైమ్‌లో పూర్తిగా కోలుకునేందుకు ఏడాదిన్నర సమయం పట్టినట్టుగానే, తన ఫేస్ నార్మల్ అయ్యేందుకు కూడా టైమ్ పడుతుందని తెలిపింది.