- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్ఆర్ఎస్తో ప్రజలను వేధిస్తున్నారు
X
దిశ ప్రతినిధి, వరంగల్: డబ్బులు లేని సమయంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శించారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో ఆస్తులకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఆస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ గందరగోళంగా మారిందని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. ఉన్న ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసిందని.. అమరుల త్యాగాలను కాపాడుకునేందుకు టీజేఎస్ ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
Advertisement
Next Story