మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించిందే చంద్రబాబు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by srinivas |
nani
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని రెచ్చిపోయారు. రాజకీయాల కోసం పెళ్లాన్ని కూడా వాడుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మహానటుడు అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని దివంగత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. తాటిచెట్టుకు కూడా వయసు ఉంటుంది దానికి విలువ ఇస్తామా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 74ఏళ్లు ఉంటే ఏం ఉపయోగమన్నారు. తనకంటే చిన్న వాడైన సీఎం జగన్‌ను గాల్లో వస్తాడు.. గాల్లో పోతాడు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేయోచ్చు మేము విమర్శలు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా నన్ను, వల్లభనేని వంశీ, జగన్ కుటుంబ సభ్యులను ఎంతలా వేధించారో అందరికీ తెలుసునన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశాడని.. దాన్ని ఏనాడైనా చంద్రబాబు ఖండించారా అని మంత్రి కొడాలి నాని నిలదీశారు.

చంద్రబాబు 420..

‘వాస్తవంగా చెప్పాలంటే సీఎం జగన్ పోరాటయోధుడు. చంద్రబాబు మాత్రం బిచ్చగాడు, 420 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వల్లభనేని వంశీకి, నాకు చంద్రబాబు రాజకీయ భిక్షపెట్టం ఏంటి? గుడివాడ నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్, ఎన్టీ రామారావు. వాళ్ళిద్దరిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా?’ అని నిలదీశారు. ‘అక్టోబర్‌ 22న వంశీ ఆన్‌ రికార్డ్‌ వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు 28 రోజుల తర్వాత ఏడ్వటానికి కారణం ఏంటో చెప్పాలి? చంద్రబాబు తన ప్రణాళిక అమలు చేసేందుకు అసెంబ్లీని వేదిక చేసుకున్నారు. లక్ష్మీపార్వతిని బూతుగా చూపించి వెళ్లగొట్టే కుట్ర చేసింది చంద్రబాబు కాదా’ అని నాని ప్రశ్నించారు.

లోకేశ్‌ను చంద్రబాబే ఓడించారు..

మంగళగిరిలో లోకేశ్‌ను చంద్రబాబు నాయుడే ఓడించారంటూ మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీకి వస్తాడనే అక్కసుతో ఓడించాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను కమ్మ కులం నుంచి వెలివేసేవారెవరూ లేరన్నారు. చంద్రబాబు మోసాలు కమ్మ సామాజిక వర్గానికి అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. గుడివాడలో త్వరలోనే కమ్మ మీటింగ్ పెడతానని స్పష్టం చేశారు. దమ్ము ఉంటే అరికెపూడి గాంధీ, మల్లాది వంశీ రావాలంటూ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరి గుడ్డలూడదీసి కొడతారో చూద్దాం అంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Next Story