- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పవన్’కు నో చెప్పిన కియారా
by Jakkula Samataha |

X
అదేంటి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నో చెప్పడమేంటీ..అనుకుంటున్నారా.. అవునండీ నిజమే..డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న చిత్రంలో కథానాయికగా నటించాలని కియారా అద్వానీని చిత్రబృందం సంప్రదించగా ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ చిత్రం ‘పింక్’ రిమేక్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం క్రిష్ దర్శకత్వంలో నటిస్తారు. ఇందులో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. బాలీవుడ్‌లో భారీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం డేట్లు ఖాళీ లేవని హీరోయిన్ కియారా చెప్పిందట. దాంతో వాణీ కపూర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నాడని సమాచారం. 2014లో వచ్చిన ‘ఆహా కల్యాణం’లో నానికి జోడీగా వాణీ కపూర్ కనిపించింది.
Next Story