జౌళి రంగంలో రూ.1000కోట్లు పెట్టుబడికి ‘ కిటెక్స్’ సుముఖత

by Shyam |   ( Updated:2021-07-09 12:09:40.0  )
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : వస్త్ర వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ కంపెనీ ముందుకు వచ్చింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కిటెక్స్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. జౌళి రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన వస్ర్త వ్యాపార సంస్థ కిటెక్స్ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవ‌కాశాల‌ను కేటీఆర్ వారికి వివ‌రించారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కంపెనీతో రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్ టైల్స్ కమిషనర్ శైలజారామయ్యర్, టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డి, ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed