- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖారవిందానికి వంటింటి చిట్కాలు.. ఎలా అంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : చూడటానికి అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉండటానికి చాలా మంది ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటారు. కానీ, మన ముఖసౌదర్యాన్ని పెంచుకోవడానికి బయటకు వెళ్లి.. ఫేస్ ప్యాక్ లాంటవి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే మన చర్మసమస్యలకు చెక్ పెట్టవచ్చును. అదే ఎలా అనుకుంటున్నారా.. ?
వంట గది ఆరోగ్యానికి నిలయం అంటారు. కదా అలా ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, మార్కెట్లో వచ్చే అనవసరమైన క్రీములు వాడటం వలన అవి మన చర్మానికి దుష్పలితాలను కలిగించవచ్చు. అందువల్ల మొటిమలు, మచ్చలు, ముడుతలు వంటి సమస్యలు ఏర్పాడే అవకాశం ఉంది. మరి వీటిని దూరం చేసుకుని ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మీ వంటింట్లో ఉన్న సహజ ఉత్పత్తులు చాలా బాగా పనిచేస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే పాలలో పసుపును మిక్స్ చేసి, ముఖం మొత్తం అప్లై చేయడం వలన పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటీరీ లక్షణాలు, మొటిమలను కంట్రోల్ చేసి, చర్మంను స్మూత్ గా మార్చుతుంది.
దాల్చిన చెక్క మన వంటింటిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే దాని వలన మనం చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను దూరం చేస్తాయి. మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను చంపేస్తాయి. కొద్దిగా దాల్చిన చెక్క తీసుకుని, దానికి తేనె కలుపుకుని ముఖానికి వర్తింపజేసుకుంటే చాలు.
టమాటో.. టమాటో వండుకోవడమే కాదు మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలో టమాటో ముఖ్య పాత్రపోషిస్తుంది. టమాటో రెండు ముక్కలు కట్ చేసి వాటిపై పసుపు వేసి ఆ టమాటో లతో ముఖంపై మసాజ్ లా చేస్తూ ఉంటే ముఖం సాఫ్ట్‌గా తయారవుతోంది. అంతే కాకుండా ముఖంపైన ఉండే ముడుతలు, మొటిమలు తొలిగిపోతాయి.
ముఖంపై మచ్చలున్న వారు వాటిని పోగొట్టుకోవడానికి పెరుగును ఉపయోగించవచ్చు. అలాగే పెరుగు చర్మ రంగును మెరుగుపరుస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని నయం చేస్తుంది. ఫేస్ మాస్క్ ఉపయోగించే వారు పెరుగుని అందులో భాగం చేసుకోండి. తళతళలాడే ముఖం మీ సొంతం అవుతుంది.