- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓడిపోయిన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన అంబర్‌పేట నియోజకవర్గంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. దేశానికి సేవ చేసే భాగ్యం అంబర్‌పేట, సికింద్రాబాద్ ప్రజలే ఇచ్చారని చెప్పుకొచ్చారు. దేశానికి మంత్రినైనా అంబర్‌పేట బిడ్డనే అంటూ గుర్తు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరకు బిడ్డ వస్తే ఎంత సంతోష పడుతుందో.. అంబర్‌పేట వచ్చినందుకు నాకు కూడా అంతే సంతోషం ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ రోజు ఢిల్లీలో ఉన్నానంటే అది అంబర్‌పేట ప్రజల దీవెనలే అన్నారు. ఉద్యమానికి ముందు ఉన్న బంగారు తెలంగాణ నినాదం ప్రస్తుతం కల్వకుంట్ల తెలంగాణగా మారిందని విమర్శించారు. కేసీఆర్ నియంత పాలన వద్దనుకుంటున్న రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్‌పేట సభలో అభిప్రాయం వ్యక్తం చేశారు.