- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ టూరిజం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కిషన్ రెడ్డి
దిశ, ములుగు/రామప్ప/హన్మకొండ చౌరస్తా: తెలంగాణ టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాధ్యమైనంత ఎక్కువ నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రామప్పకు యూనెస్కో గుర్తింపు దక్కిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి రామప్పలోని రుద్రేశ్వరాలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పర్యాటక రంగంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో టూరిజం అధికారులు, పురావస్తు శాఖ అధికారులతో కిషన్ రెడ్డి చర్చించారు. అనంతరం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ, ప్రజా మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి రామప్ప ఒక నిదర్శనం అన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామప్ప ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రామప్ప దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా పర్యాటక వసతుల గురించి నిధులు సమకూర్చి డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.
- Tags
- kishan reddy