- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల ఒక్కడు గెలిస్తే.. ఆ ముగ్గురు ఓడిపోతారు: కిషన్ రెడ్డి
దిశ, కమలాపూర్: హుజురాబాద్లో జరిగే ఉప ఎన్నికలు మూడున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఎన్నికలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వస్తున్న రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ద్వారానే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపాధి హామీ పథకం, పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలను అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం మోడీ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కానీ, డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు హుజురాబాద్ నుంచే మొదటి అడుగు పడాలని ఉద్ఘాటించారు.
ఈటలపై కిషన్ రెడ్డి ప్రశంసలు..
ఈటల రాజేందర్ నీతికి, నిజాయితీకి ప్రతీక అని కిషన్ రెడ్డి కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో అత్యథిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలిస్తే.. 2023 ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు ఓడిపోయి.. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఎంతోమంది పదవులను బంధుత్వం పేరుతో సంపాధించారని.. కానీ, ఉద్యమ దశ నుంచి చివరి వరకు ఉన్న ఈటలను బహిష్కరించడం దారుణమన్నారు. అయినా.. ఈటల రాజేందర్ ఒక్కడే ఒక సైన్యమంటూ భరోసా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
ఇదే సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయం నడుస్తోందన్నారు. కేసీఆర్ నియంత పాలన, అహంకారం, నిజాం పాలనను తలపించే విధంగా ఉందన్నారు. అందుకు అనుగుణంగానే అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతారని.. అందుకు సంకేతమే హుజురాబాద్ ఉప ఎన్నికలు అంటూ ఈటల చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్‌లు కూడా దక్కవంటూ కౌంటర్ వేశారు. ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ధర్మా రావు, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, బొడిగె శోభ, తుల ఉమ, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.