- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, అంబర్ పేట్: రాబోయే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయ్యాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతంరావు అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
బీజేపీని బూత్ స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడే ఎన్నికలలో ఎమ్‌ఎల్‌ఏ, ఎంపీలతో పాటు ముఖ్య మంత్రి, ప్రధానమంత్రి పదవులను కైవసం చేసుకుంటామని అన్నారు. పార్టీ కమిటీలతో పాటు వివిధ మోర్చాల కమిటీల పనితీరును కిషన్‌రెడ్డి సమీక్షించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోది దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంకేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, నాయకులు ప్రకాష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజశేఖర్, బండ కార్తీక రెడ్డి పాల్గొన్నారు.