- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8సేఫ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: నేరాలపై తీసుకుంటున్న స్మార్ట్ పోలీస్ విధానం అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, 8సేఫ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటని తెలిపారు. పెట్రోలింగ్ వ్యవస్థ, షీటీమ్స్, నేరాలు జరిగే హాట్ స్పాట్‌లను గుర్తించడంలో కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆదివారం అంబర్‌పేట పరిధిలో రూ.2.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాలను డీసీపీ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని, హైదరాబాద్‌లోనూ జనాభా పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతోందన్నారు. వృత్తి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసలు పెరిగాయన్న కేంద్రమంత్రి… నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story