లక్షమంది ఓవైసీలు అడ్డొచ్చినా..

by Shyam |
లక్షమంది ఓవైసీలు అడ్డొచ్చినా..
X

దిశ, వెబ్‌డెస్క్: లక్షమంది ఒవైసీలు అడ్డొచ్చినా పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఆపలేరనీ, దానిని అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీ అసదుద్దీన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అండతోనే ఎంఐఎం నాయకులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలూ త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందిస్తూ.. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి హైదరాబాద్‌‌లో ఎందుకున్నారని ప్రశ్నించారు. ముందు అక్కడికెళ్లి, అల్లర్లను అదుపులోకి తీసుకురావాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో కూర్చుని ఇతర పార్టీలను విమర్శించడం సరికాదన్నారు.

Advertisement

Next Story