- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు మాకు నీతులు చెబుతారా.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బియ్యం కొనమని చెప్పలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల దెబ్బతో కొత్త సమస్యను కావాలనే సృష్టించారన్నారు. అందుకే రైతుల ధాన్యం నెల రోజుల నుంచి కొనడం లేదన్నారు. ముందు రైతుల ధాన్యాన్ని కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
పంజాబ్‌లో కొంటారు.. తెలంగాణలో కొనరు అని చెబుతున్న కేసీఆర్.. ఆ మాట ఎవరు.. ఎక్కడ అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీలాగా గజ్వేల్‌లో ఒక తీరు, దుబ్బాకలో మరో తీరు ప్రదర్శిస్తూ పక్షపాత రాజకీయాలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇటువంటి తీరు అమలు చేస్తున్న కేసీఆర్ మాకు నీతులు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకో రూల్ పెడుతూ అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.
- Tags
- kishan reddy