విశాఖ ఉక్కు ఉద్యమంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by srinivas |
Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుండగా.. దీనిపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రైవేటీకరణపై తాము వెనక్కి తగ్గేది లేదని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించగా.. ప్రైవేటీకరణ చేయడం తమకు ఇష్టం లేదని, దీనిపై అగ్రనాయకత్వాన్ని కలుస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నష్టాల్లో కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నడపడం ప్రభుత్వానికి భారంగా మారిందని, ఒకవేళ స్టీల్ ప్లాంట్‌ను తమ పరిధిలోకి తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే.. అప్పుడు కేంద్రం ఆలోచిస్తుందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై స్పందించిన కిషన్ రెడ్డి… ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed