బాబుది అవినీతి.. జగన్‌ది అహంకారం: కిషన్ రెడ్డి

by srinivas |
బాబుది అవినీతి.. జగన్‌ది అహంకారం: కిషన్ రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది అవినీతి ప్రభుత్వమన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అహంకార ప్రభుత్వమని విమర్శించారు. రాయలసీమ జన్ సంవాద్ వర్చువల్ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో కేంద్రీకృత అవినీతి ఉండేదని అన్నారు. ఇప్పుడా అవినీతి వికేంద్రీకరణ జరిగిందని జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో అవినీతి రాజ్యమేలితే, జగన్ హయాంలో ఏపీ పోలీసు రాజ్యంగా మారిందని విమర్శించారు. ఏపీలో అక్రమ కేసులపై తనకు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని మండిపడిన కిషన్ రెడ్డి… ఏపీలో పార్టీ మారితే కష్టం, సభలో పాల్గొంటే కష్టం అనేలా పరిస్థితి ఉందని చెప్పారు.

Advertisement

Next Story