నాన్నమ్మతో ఏకాంతంగా వృద్ధుడు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన మనవడు.. సీన్ కట్ చేస్తే..!

by Anukaran |
నాన్నమ్మతో ఏకాంతంగా వృద్ధుడు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన మనవడు.. సీన్ కట్ చేస్తే..!
X

దిశ, నిజామాబాద్ రూరల్: వివాహేతర సంబంధం వృద్ధుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ రూరల్‌లో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి మైసయ్య (60), లచ్చవ్వ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు స్థానిక ఎస్సై తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో మైసయ్య.. లచ్చవ్వ దగ్గరకు వచ్చాడు. ఇదే సమయంలో లచ్చవ్వ మనుమడు గంగ కిషన్‌ కూడా వచ్చాడు. దీంతో మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటూ కోపంతో గంగకిషన్ మైసయ్యను ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య మాటకు మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మైసయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామస్తులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మైసయ్య మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మైసయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story