- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నవ్వులను’ అర్థం చేసుకునే నవజాత శిశువులు!
దిశ, ఫీచర్స్ : పసిపిల్లలు నవ్వుతుంటే చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. చిన్నారులను నవ్వించేందుకు మనం నానా హంగామా చేస్తుంటాం. అయితే వారు నిద్రలో చిందించే చిరునవ్వులు.. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును ప్రతిఫలిస్తాయని బ్రిటీష్ పరిశోధకుడు ఆడ్‌మన్ ఇదివరకే తేల్చి చెప్పాడు. ఇక మొదటి నెలలోనే బయట ప్రపంచంలో ఉన్న శబ్దాలను స్పష్టంగా వినగలిగే నవజాత శిశువులు.. ఐదు-ఆరు నెలల్లో రంగులను, పదకొండు నెలల నుంచి మాతృభాషకు, ఇతర భాషలకు తేడాను గుర్తించగలిగే స్థాయికి వస్తారు. అయితే పిల్లలు ఒక నెల వయసు నుంచి హాస్యాన్ని అర్థం చేసుకోగలరని తాజా అధ్యయనం వెల్లడించింది.
బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు చెందిన నిపుణుల బృందం 20 ప్రశ్నలతో కూడిన ఎర్లీ హ్యూమన్ సర్వే (EHS) నిర్వహించింది. అప్పుడే పుట్టిన పసిపాపల నుంచి 47 నెలల వయస్సు గల దాదాపు 700 మంది పిల్లల తల్లిదండ్రులను ఈ ప్రశ్నలను అడిగారు. ప్రపంచ నలుమూలలకు చెందిన పేరెంట్స్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయగా.. ఈ సర్వేతో మొదటిసారిగా చిన్నపిల్లల నవ్వు, జోకులు అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని.. వయస్సు ఆధారంగా మ్యాప్ చేశారు. కొంతమంది పిల్లలు హాస్యాన్ని నెల నుంచే అర్థం చేసుకోగా.. 50% మంది పిల్లలు రెండు నెలల లోపు హాస్యాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. దాదాపు 21 రకాల హాస్యాన్ని గుర్తించగలరని కనుగొన్న బృందం.. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు హాస్యానికి సంబంధించిన భౌతిక, దృశ్య శ్రవణ రూపాలను గుర్తించగలుతున్నారని స్పష్టం చేసింది. ఇందులో హైడ్ అండ్ సీక్, చక్కిలిగింతలు, ఫన్నీ ఫేసెస్, శారీరక హాస్యం (ఉదా: మీ కాళ్లలో తలపెట్టి నవ్వించడం), ఫన్నీ వాయిసెస్, సౌండ్స్, వెంబడించడం, వస్తువులతో తమాషాగా ఆడటం (ఉదా: మీ తలపై కప్పు పెట్టడం) వంటివి పిల్లల ముందు ప్రదర్శించినప్పుడు ఆయా నవ్వుల రూపాలను అర్థం చేసుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
అయితే ఏడాది లోపు పిల్లలు, ఇతరుల నుంచి రియాక్షన్స్, బట్టలను తీయడం, ఇతరులను భయపెట్టడం, జంతువును అనుకరించడం, టాయిలెట్ హ్యుమర్ మొదలైన వాటితో కూడిన హాస్యాన్ని ప్రశంసించారు. ఇక రెండు సంవత్సరాల వయస్సున్న పిల్లలు అర్ధంలేని పదాలు చెప్పడం, తప్పుగా లేబుల్ చేయడం వంటి విషయాలతో పాటు ఇతరులను ఎగతాళి చేయడం, దూకుడుగా ఉండే హాస్యాన్ని కూడా ఇష్టపడ్డారు. మూడేళ్ల పిల్లల విషయానికి వస్తే.. ఫన్, ట్రిక్స్ వంటి వాటికి అట్రాక్ట్ అయ్యారు.
హాస్యం అనేది జీవితంలో మొదటి నాలుగు సంవత్సరాల్లో సంక్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ అని మా ఫలితాలు హైలైట్ చేస్తున్నాయి. పిల్లలతో పాటు పెద్దల జీవితంలోని అనేక అంశాల్లో హాస్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, హాస్యం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకునేందుకు సాధనాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. దీని ద్వారా హ్యూమర్ ఆవిర్భావాన్ని మాత్రమే కాకుండా, హాస్యం ఎలా ఉంటుందో మనం మరింత అర్థం చేసుకోగలం.
– బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్