హైదరాబాదు నడిబొడ్డున కిడ్నాప్, హత్య

by Sumithra |
హైదరాబాదు నడిబొడ్డున కిడ్నాప్, హత్య
X

హైదరాబాదు నడిబొడ్డున జరిగిన కిడ్నాప్, మర్డర్ కలకలం రేపాయి. ఈ నెల 1న జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన వివారల్లోకి వెళ్తే… ఏజీ కాలనీలోని వికాశ్‌పురికి చెందిన పి.రమేశ్ (50) చేపల వ్యాపారి. ఈ నెల 1న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. తర్వాతి రోజు ఉదయం రమేశ్ మొబైల్ ఫోన్ నుంచి అతడి కోడలికి మద్యం మత్తులో వాంతులు చేసుకున్నాడని, రాత్రికి ఇంటికి వస్తాడని, నిద్ర లేవగానే తీసుకొచ్చి దిగబెడతామంటూ మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్ వచ్చిన ఫోన్ చేయడంతో కాసేపటికే అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఈ నెల 2న మధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ తరువాతి రోజు అతని ఫోన్ నుంచి కోడలికి మరో మెసేజ్ వచ్చింది. అతడిని కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించి.. రమేశ్‌ను ఈఎస్ఐ వద్ద కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఇంతలో అక్కడికి దగ్గర్లోనే ఉన్న జవహర్ నగర్ లో తాను అద్దెకు ఇచ్చిన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో శివరామ్ కుమార్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూసి హతాశుడయ్యాడు. కాళ్లు, చేతులు కట్టేసి కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకి చేరకున్న పోలీసులు షాక్ తిన్నారు. మృతుడిని రమేశ్‌గా గుర్తించారు.

కిడ్నాప్ చేసిన వ్యక్తులే ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేసిన రోజునే అతడు హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చివేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులను వెనక్కి మడిచి కట్టారని పోలీసులు తెలిపారు. శివరామ్‌కుమార్ ఇంట్లో అద్దెకు ఉంటున్న శ్రీనివాస్, అరుణ, పిల్లలు పరారైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed