- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుర్జ్ ఖలీఫాపై హీరో సుదీప్ ‘విక్రాంత్ రోణ’ టీజర్
దిశ, సినిమా: ‘25 ఏళ్ల క్రితం.. భారతదేశం.. సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ రైజింగ్‌కు విట్‌నెస్‌గా నిలిచింది’ అంటూ వరల్డ్ ఫేమస్ దుబాయ్ ల్యాండ్ మార్క్ బుర్జ్ ఖలీఫా సుదీప్ సినీ ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వర్సటైల్ యాక్టర్, ట్రూ లెజెండ్..25 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ స్పెషల్ వీడియో ప్లే చేసింది. దాంతో పాటు తన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ టీజర్ వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై ఆవిష్కరించగా.. అభిమానులు సుదీప్ పేరును నినదిస్తూ కర్నాటక జెండాను రెపరెపలాడించారు. ఈ స్పెషల్ మార్క్ రీచ్ అయిన సుదీప్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు సెలెబ్రిటీలు, అభిమానులు.
కర్నాటక జెండా బుర్జ్ ఖలీఫాపై ఎగురుతున్నందుకు గర్వంగా ఉందన్నారు సుదీప్. సినిమా పరిశ్రమలో కొత్తగా వచ్చిన ఆర్టిస్టుల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని.. దుబాయిలో తన అభిమానులు ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్ష్యంగా నిలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.