కియారా డీగ్లామరస్ టచ్

by Shyam |
కియారా డీగ్లామరస్ టచ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ కియారా అద్వానీ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతుంది. ‘ఇందూ కీ జవానీ’ సినిమాతో థియేటర్స్‌లో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్న భామ కొత్తగా మరో సినిమా అనౌన్స్ చేసింది. అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేయబోతోంది. ఈ చిత్రానికి ‘కర్రమ్ కుర్రమ్’ టైటిల్ ఫైనల్ చేయగా.. గ్లెన్ బెరెటో, అంకుష్ మోహ్లా డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హౌజ్ వైఫ్‌గా కనిపించబోతోంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ‘లిజ్జట్ పాపడ్’ బ్రాండ్ వెనుక ఉన్న స్త్రీ కథే స్టోరీ. ఆరుగురు హౌజ్ వైఫ్స్‌తో కలిసి ఉమన్ కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే మహిళగా నటించనుంది భామ. పాపడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంటింటికి వెళ్లి అమ్మిన మహిళ ఇండియాలో పాపడ్ బ్రాండ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఎలా నిలిచింది? అనే లైన్‌పై మాసివ్ ఇంట్రెస్ట్ తీసుకురానుందంటున్నారు మేకర్స్. ఈ సినిమా ద్వారా కియారా రెగ్యులర్ గ్లామరస్ టచ్ కాకుండా డీగ్లామర్ టచ్ ఇస్తుండగా..న్యూ అవతార్‌లో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం కియారా ఇందూ కీ జవానీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మరోవైపు ఆమె ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్‌ కూడా కొనసాగుతుంది. వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఫిల్మింగ్ ప్రజెంట్ ఛండీఘడ్‌లో జరుగుతుంది. వరుణ్, అనిల్, నీతూతోపాటు డైరెక్టర్‌కు కూడా కొవిడ్ పాజిటివ్ రాగా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed