ఆ కుర్ర హీరోతో డేటింగ్ కన్ఫర్మ్ చేసినట్టేనా కియారా?

by Shyam |   ( Updated:2021-03-18 02:11:17.0  )
ఆ కుర్ర హీరోతో డేటింగ్ కన్ఫర్మ్ చేసినట్టేనా కియారా?
X

దిశ,వెబ్ డెస్క్:చిత్ర పరిశ్రమ అన్నాకా హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్ గాసిప్స్ సర్వ సాధారణం. అందులోనూ బాలీవుడ్ లో ఐతే మరీ కామన్. ఇప్పటికే బాలీవుడ్ లో డేటింగ్లు, షాపింగ్లు అంటూ తిరిగి బ్రేక్ అప్ చెప్పుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇక తాజాగా బి టౌన్ లో మరో కొత్త జంట డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ‘భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ అమ్మడు గత కొంత కాలంగా బాలీవుడ్ కుర్ర హీరో సిద్దార్థ్ మల్హోత్రాపై మనసు పారేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఇటీవలే ఈ జంట మాల్దీవులు వెకేషన్ కి వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు.ఆ తర్వాత సిద్దార్థ్ ఫ్యామిలీ వేడుకల్లో కియారా మెరవడం అక్కడ కొత్త చర్చకు దారితీసింది. దీంతో అందరు నిజంగానే కియారా – సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా తన డేట్ గురుంచి నోరు విప్పి అభిమానులకు హింట్ ఇచ్చింది.

తాజాగా ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూ లో కియారా మీరెప్పుడైనా డేట్ చేసారా ? అన్న ప్రశ్నకు, అవును నేను ఇదివరకు డేట్ చేశాను .. ఈ సంవత్సరం చాలా మంచి సమయం గడిపాను అంటూ అతగాడి పేరు మాత్రం చెప్పకుండా తప్పించుకుంది. ఇంతకీ కియారా, సిద్దార్థ్ గురించే చెప్పి ఉంటుందా? తన రిలేషన్ ని కన్ఫర్మ్ చేసిందా ? లేదా అంటే ఏం చెప్పలేము. కాకపోతే కియారా ప్రస్తుతం డేటింగ్ లో ఉందన్న హింట్ మాత్రం ఇచ్చిందనే చెప్పాలి. త్వరలోనే తన రిలేషన్ గురుంచి అధికారికంగా తెలుపుతుందేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం కియారా, సిద్దార్ద్ తో కలిసి ‘షేర్షా’ చిత్రంలో నటిస్తుంది.

Advertisement

Next Story