- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యం : కియా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ తన అమ్మకాల నెట్‌వర్క్‌ను చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టై-జిన్ పార్క్ చెప్పారు. ఈ విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా తమ ఉనికిని మరింత పటిష్టంగా మార్చుకోవాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కియా మోటార్స్ ఇప్పటికే విడుదల చేసిన సెల్టోస్, సోనెట్ మోడళ్లతో భారత్‌లో మిగిలిన అన్ని కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ డీలర్ భాగస్వాముల లాభదాయకతను పెంచడంపై దృష్టి పెట్టినట్టు ఆయన వెల్లడించారు. ‘ఈ ఏడాది చివరి నాటికి 300 టచ్ పాయింట్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
తాజాగా టైర్-4, స్థానిక మార్కెట్లలో విస్తరించడంపై దృష్టి పెట్టనున్నాం. ఈ నిర్ణయాలు భారత మార్కెట్లో మరింత బలంగా మారేందుకు వీలవుతుందని టై-జిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ కియా మోడళ్లకు విపరీతమైన డిమాండ్ లభించింది. అందుకే, రిమోట్ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. కంపెనీ విస్తరణతో పాటు, మా కంపెనీ డీలర్ భాగస్వామి లాభదాయకతను కూడా పరిగణలోకి తీసుకుంటాం. తద్వారా రాబోయే 2-3 ఏండ్ల తమ వ్యూహాలకు ఈ రెండు అంశాలు కీలకంగా ఉండనున్నట్టు టై-జిన్ చెప్పారు.