డిజిటల్ ఏజ్ స్టోరీ.. అనన్య ఫ్రెండ్స్‌తో ఇబ్బందే!

by Shyam |
Kho Gaye Hum Kahan Poster Out
X

దిశ, సినిమా : బాలీవుడ్ నుంచి మరో న్యూ జనరేషన్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ఆదర్శ్ గౌరవ్ కాంబినేషన్‌లో ‘ ఖో గయే హమ్ కహాన్’ మూవీ ప్రకటించారు మేకర్స్. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, టైగర్ బేబీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ద్వారా అర్జున్ వేరియర్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. జోయా, రీమా, రితీష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ముంబైలో ముగ్గురి ఫ్రెండ్స్ డిజిటల్ ఏజ్ స్టోరీగా వస్తున్న సినిమా కథను జోయా అక్తర్, సింగ్, రీమా అందించగా.. ప్రజెంట్ జనరేషన్ మూవీకి త్వరగా కనెక్ట్ అయిపోతారని తెలిపారు. కాగా సిద్ధాంత్ చతుర్వేది, అనన్య షకున్ బత్ర దర్శకత్వంలో వస్తున్న మూవీలో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకోగా.. నెట్‌ఫ్లిక్స్ ‘వైట్ టైగర్’తో బ్రేకౌట్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు గౌరవ్.

Advertisement

Next Story

Most Viewed