నల్గొండ సెగ్మెంట్ లో ఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే

by Anukaran |   ( Updated:2021-03-18 00:06:34.0  )
నల్గొండ సెగ్మెంట్ లో ఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే
X

దిశ ప్రతినిధి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో జరుగుతోంది. బుధవారం ఉదయం 8.40 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్.. నిర్విరామంగా సాగుతోంది. అందుకోసం ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది షిఫ్టుల పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల సమయానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తొలి, రెండో రౌండ్లు పూర్తయ్యాయి. అయితే ఈ రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఎవ్వరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని ఓ పరిశీలిద్దాం..

♦ మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పోలైన ఓట్లు

మొదటి రౌండ్ -16130
రెండో రౌండ్ -15857
రెండు రౌండ్ల కలిపితే.. 31987
రెండు రౌండ్లలో లీడ్ 7871

♦ రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)

మొదటి రౌండ్- 12,046
రెండో రౌండ్ – 12070
రెండు రౌండ్ల మొత్తం- 24116

♦ మూడో స్థానంలో టీజెఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం

మొదటి రౌండ్- 9080
రెండో రౌండ్- 9448
రెండు రౌండ్ల మొత్తం -18528

♦ నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి

మొదటి రౌండ్ 6615
రెండో రౌండ్ 6669
రెండు రౌండ్ల మొత్తం 13284

♦ ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్

మొదటి రౌండ్ 4354
రెండో రౌండ్ 3244
మొత్తం 7598

చెల్లని ఓట్ల వివరాలు..

మొదటి రౌండ్ 3151
రెండో రౌండ్ 3009
రెండు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 6160

Advertisement

Next Story

Most Viewed