- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘డబుల్’ గేమ్.. కార్పొరేటర్ల బంధువులకే పట్టాలు..
దిశ ఖమ్మం టౌన్; ఖమ్మం నగరంలో డబల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు ఎదురుచూస్తుంటే అధికార పార్టీ కార్పొరేటర్లకి ఇదేం పట్టడం లేదు. బుధవారం నగరంలో చాలా చోట్ల జరిగిన డబుల్ బెడ్రూం ఇండ్లi లక్కీ డ్రాలో పేదలకు కాకుండా పెద్దలకే న్యాయం జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూం స్కీంను ప్రజల వద్దకు తీసుకొస్తే.. కొంతమంది అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆ ఆశయానికి గండి కోరుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు చెందల్సిన డబల్ బెడ్రూం ఇండ్లు, కార్పొరేటర్ల చుట్టాలకే పరిమితం అవుతున్నాయి అంటూ వాపోతున్నారు.
లక్కీ డ్రా తిస్తామంటూ అధికారులు, కార్పొరేటర్లు ఒక్కటై తమకు అన్యాయం చేశారంటూ బాధితులు కొందరు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాత్రి వరకు తహశీల్దార్ కార్యాలయం లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం వారిని తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసుల ముందు కూడా తమ బాధను చెప్పుకున్నారు.