- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవ్ ఇన్ థియేటర్‌లో అనన్య సినిమా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ నటించిన ‘కాలీ పీలీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జాయ్ ఫుల్ రైడ్‌కు రెడీ అయిపోవాలని ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు కాగా, అక్టోబర్ 2న సినిమా జీ ప్లెక్స్‌లో రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. కరోనా కారణంగా ఇప్పటికే థియేటర్‌లో సినిమాల విడుదల ఆగిపోగా, ఫస్ట్ టైమ్ ‘కాలీ పీలీ’ సినిమా థియేటర్లో విడుదల అవుతుంది. బెంగళూరు, గురుగ్రామ్‌లో డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లోనూ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉండగా.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇషాన్, అనన్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఇషాన్ టాక్సీ డ్రైవర్‌గా, అనన్య ఓ వ్యభిచార గృహం నుంచి డబ్బుతో పారిపోయి వచ్చిన యువతిగా కనిపించనుంది. ఈ ఇద్దరు కలిసి చేసే జర్నీ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండనుంది. మక్బూల్ ఖాన్ దర్శకత్వంలో హిమన్షు కిషన్ మెహ్రా, అలి అబ్బాస్ జాఫర్, జీ స్టూడియోస్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.