- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎఫ్‌సీ నుంచి కొత్త ఔట్‌లెట్లు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశీయ వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకొచ్చినప్పటికీ ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎఫ్‌సీ భారత్‌లో తన రెస్టారెంట్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తోంది. రానున్న సంవత్సరాల్లో దేశీయంగా వృద్ధి పెరుగుతుందని నమ్ముతున్నట్టు కంపెనీ వెల్లడించింది. 2020లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సుమారు 30 కొత్త రెస్టారెంట్లను ప్రారంభించిన కేఎఫ్‌సీ ఇండియా, ఈ ఏడాది కూడా కొత్త ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. దీనివల్ల మరింతమంది కొత్త వినియోగదారులను చేరుకోగలమని కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనర్ చెప్పారు.
‘భారత్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకోవడమే లక్ష్యం. ఇది కంపెనీ అతిపెద్ద వ్యూహాలలో ఒకటి. నేరుగానే కాకుండా డిజిటల్‌గా కూడా వినియోగదారుల్లో బ్రాండ్ వృద్ధిని సాధించాలని భావిస్తున్నాం. ఈ లక్ష్యంతోనే కొత్త ఔట్‌లెట్లను తీసుకురానున్నట్టు’ సమీర్ మీనర్ వివరించారు. కరోనాకు ముందు భారత్‌లో మొత్తం 450 కేఎఫ్‌సీ రెస్టారెంట్లు ఉండగా, ప్రస్తుతం ఇది 130కి పైగా నగరాల్లో 480కి చేరుకున్నాయని సమీర్ పేర్కొన్నారు. కరోనాతో ఆన్‌లైన్ ఆర్డర్లు పెరుగుతుండటం, వినియోగదారుల ప్రవర్తనలో మార్పు నేపథ్యంలో వారి అవసరాలను తీర్చేందుకు కేఎఫ్‌సీ ఇండియా ఆ దిశగా వృద్ధిని సాధించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందన్నారు. తమ ఆన్‌లైన్ బిజినెస్ కరోనాకు ముందున్న దానికంటే 50 శాతం పెరిగి ఉండొచ్చని భావిస్తున్నామని సమీర్ వెల్లడించారు.