- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేఎఫ్‌సి ఇండియాలో 2024 నాటికి రెట్టింపు మహిళా ఉద్యోగులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థ కేఎఫ్‌సీ ఇండియా రానున్న మూడు, నాలుగేళ్లలో తమ మహిళా ఉద్యోగులను రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించింది. దేశీయ పరిణామాల నేపథ్యంలో పలు మార్పుల దిశగా ప్రణాళికలను చేపట్టనున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా రెండు రెస్టారెంట్లను పూర్తిగా మహిళలతో నిర్వహిస్తున్న కేఎఫ్‌సీ ఇండియా మొత్తం 30 శాతం నుంచి 2024 నాటికి 40 శాతానికి పెంచాలని భావిస్తోంది. ‘2013-14 నుంచి కరోనాకు ముందు వరకు ఏడేళ్ల కాలంలో మహిళా ఉద్యోగులు 7-8 శాతం నుంచి 30 శాతానికి పెరిగారు. వీరిలో టీమ్ మెంబర్లతో పాటు రెస్టారెంట్ సారథ్యాన్ని నిర్వహిస్తున్నవారు కూడా ఉన్నారని’ కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ చెప్పారు. 2024 నాటికి మహిళా ఉద్యోగులను 40 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఆయన అన్నారు. ‘దేశీయంగా తమ రెస్టారెంట్లలో 2,500 మంది మహిళలు ఉన్నారు. రానున్న 3-4 ఏళ్లలో వీరి సంఖ్యను 5,000 లకు పెంచాలని భావిస్తున్నామని’ సమీర్ మీన వెల్లడించారు. ప్రస్తుతం కేఎఫ్‌సీ ఇండియా దేశవ్యాప్తంగా 130కి పైగా నగరాల్లో 480 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.