- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి సమస్యలు.. కాంగ్రెస్ కమిటీ కీలక సూచనలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ రికార్డుల సమస్య తీవ్రంగా ఉన్నదని, ఇది కొలిక్కి రాక రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, మానసికంగా కుంగిపోతున్నారని ధరణిపై ప్రత్యేకంగా ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశించిన ధరణి వ్యవస్థ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని, సంక్లిష్టంగా మారి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా తయారైందని మంత్రి హరీశ్‌రావుకు రాసిన లేఖలో ఆ కమిటీ పేర్కొన్నది. నిజాం కాలంలో పకడ్బందీగా జరిగిన భూ రికార్డుల నిర్వహణ, తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ అసమర్ధత కారణంగా గందరగోళంగా మారిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించిన ఈ కమిటీ 14 అంశాలను మంత్రి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరింది.
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగలేదని, ఈ కారణంగా 2018లో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ గందరగోళంగా మారిందని, లక్షలాది మంది రైతులు భూమిపై హక్కు కోల్పోయారని, కొత్త పుస్తకాలు రాక ఇప్పటికీ తహసీల్దారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. పలువురు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయాన్ని గుర్తుచేసింది. నాలుగేండ్లయినా పాసుబుక్కులు రాక, ఆన్‌లైన్‌లో భూముల వివరాలు నమోదు కాక సుమారు పాతిక లక్షల ఎకరాల పట్టా భూమి లెక్కల్లో లేకుండా పోయిందని పేర్కొన్నది. ధరణి వ్యవస్థ మీదనే రైతులకు నమ్మకం పోయిందని నొక్కిచెప్పింది.
సమగ్ర భూ రికార్డుల కోసం ఆ కమిటీ సూచించిన కొన్ని అంశాలు
• గ్రామ స్థాయి సర్వే జరగాలి
• రికార్డులు రాసుకోవాలి
• గ్రామ సభలు ఏర్పాటు చేయాలి
• ధరణి రికార్డులను ప్రింటు తీసి ప్రతీ గ్రామ పంచాయతీలో పెట్టాలి
• జమాబందీ పెట్టి అధికారులు క్షేత్ర స్థాయికి పర్యటించాలి
• ధరణి తప్పులను సరి చేయడానికి చట్టంలో అవకాశం కల్పించాలి
• పెండింగ్‌లో ఉన్న సుమారు 9.24 లక్షల సాదాబైనామాల క్రమబద్ధీకరణ వెంటనే జరగాలి
• కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి తహసీల్దార్లకు అధికారం కల్పించాలి
• నిషేధిత జాబితా సెక్షన్ 22-ఏ అమలుకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలి. నిషేధిత జాబితా ప్రతులను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తప్పులను సరిదిద్దడానికి స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ఆధారిటీని ఏర్పాటు చేయాలి
• సుమారు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, ఇనాం భూములకు పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వాలి
• భూమి సమస్యల పరిష్కారానికి ఆర్ఓఆర్ స్థానంలో సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి
• 1958 కంటే ముందు ఇచ్చిన సుమారు 5 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
• స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన సుమారు 5 లక్షల ఎకరాల భూములను అమ్ముకోవడానికి చట్ట ప్రకారం అనుమతులు ఇవ్వాలి. వాటి వివరాలను ధరణిలో నమోదు చేయాలి
• డిజిటల్ సర్వేకు బదులుగా సమగ్ర సర్వే చేపట్టాలి. ఇందులో కమ్యూనిటీని భాగస్వాములను చేయాలి.
• సమగ్ర సర్వే తర్వాత టైటిల్ గ్యారంటీ చట్టం చేసి రైతులకు భూమిపై హక్కు కల్పించాలి.