- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూతుమంత్రంగా చావు డప్పు కార్యక్రమం.. ఎక్కడ కనిపించని కీలక నేతలు
దిశ,నర్సాపూర్: వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చావు డప్పు కార్యక్రమం నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని కేసిఆర్ ఆదేశించారు. దానికి విరుద్దంగా టీఆర్‌ఎస్ నేతలు నర్సాపూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి పది నిమిషాల్లోనే చేతులు దులుపుకున్నారు. ధర్నా తదితర కార్యక్రమాలు నిర్వహించలేదు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనలేదు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, స్టేట్ లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డిలు నియోజకవర్గంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పాల్గొనకపోవడం విశేషం.