పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

by Sumithra |
gelatin sticks 2
X

దిశ, తాండూరు: పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం పేలిన ఘటనపై సోమవారం పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. పెద్దేముల్ మండల కేంద్రంలో భారీ స్థాయిలో జిల్లేటిన్ స్టిక్స్, డేటర్నేటర్స్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు డీఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం… పెద్దేముల్ గ్రామానికి చెందిన వెంకట్(19) తీవ్ర గాయాలయ్యాయి.

gelatin sticks

వెంకట్‌ను విచారించగా తన స్నేహితుడు బోయిని రాజుతో కలిసి జూనియర్ కళాశాల సమీపంలోని ఇరిగేషన్ గోడాన్‌లో 1160 జిల్లేటిన్ స్టిక్స్, 3000 వరకు డిటర్నేటర్స్ గుర్తించినట్లు వెల్లడించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లేటిన్ స్టిక్స్, డిటర్నేటర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన వాటిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు పదార్థాలకు సంబంధించి కేసును అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ జలంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed