నేను అప్పుడే చెప్పిన.. మీరే విన్లేదు : కెవిన్ పీటర్సన్

by Shyam |
నేను అప్పుడే చెప్పిన.. మీరే విన్లేదు : కెవిన్ పీటర్సన్
X

దిశ, స్పోర్ట్స్ : ‘అప్పుడే సంబురాలు చేసుకోకండి. అసలైన టీమ్‌తో మీరు ఆడాల్సి ఉంది. కొంచెం జాగ్రత్త’ అని గబ్బాలో టెస్టులో టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశారు. అయితే అప్పుడు అతడిపై భారత క్రికెట్ జట్టు అభిమానులు విరుచుకపడ్డారు. ఇంగ్లాండ్ కూడా చిత్తుగా ఓడిపోతుందంటూ కామెంట్లు పెట్టారు. కాగా, చెన్నైలో ఇంగ్లాండ్ విజయం తర్వాత కెవిన్ పీటర్సన్ మరో సారి ట్వీట్ పెట్టారు. ‘నేను ముందుగానే హెచ్చరించాను. ఎక్కువగా సంబురాలు చేసుకోవద్దని . ఇప్పుడు చూడండి ఏమయ్యిందో’ అని మరో ట్వీట్ చేశాడు. అయితే దీనిపై కూడా టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా తొలి టెస్టు ఓడి సిరీస్ గెలిచాం అని ఒకరు చెప్పగా.. ఇంకా సిరీస్ ముగియలేదు నువ్వు కూడా ఎక్కువ సంబురపడిపోకు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

Next Story