కేశినేని వర్సెస్ వెల్లంపల్లి.. ట్విట్టర్ వార్

by srinivas |
కేశినేని వర్సెస్ వెల్లంపల్లి.. ట్విట్టర్ వార్
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వర్సెస్ టీడీపీ ఎంపీ కేశినేని నాని మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఈ ఉదయం వెల్లంపల్లిపై కేశినేని ట్విట్టర్ మాధ్యమంగా అమాత్యా ఇదేం పని? అంటూ “వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావు. దుర్గగుడిని మింగేస్తున్నావు, వినాయక గుడి ఆదాయం కాజేస్తున్నావు. చివరికి ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో కూడా వ్యాపారం ఏమిటి నాయనా? శవాల మీద కూడా పైసలు సంపాదించేట్టు ఉన్నావు” అంటూ ట్వీట్ చేసి, మంత్రి అనుచరుడొకరు నకిలీ శానిటైజర్లతో దోచేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు.

దీనికి వెల్లంపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ, ‘కేశినేని నాని గారూ, మీవి చీప్ ట్రిక్స్’ అని ఎద్దేవా చేస్తూ, “నిలువు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం మీరే… మీ ట్రావెల్స్ ఉద్యోగులే మిమ్మల్ని ధర్నా చౌక్ లో నిలబెట్టారు. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన మాంత్రికుడు మీరు. మీ హయాంలో చీరల దొంగతనం నుంచి ప్రతిదీ అవినీతిమయమే. ఆఖరికి మీ పచ్చ పత్రిక బాత్రూమ్ టిష్యూగా కూడా ఉపయోగపడదు” అంటూ టిట్ ఫర్ టాట్ సమాధానమిచ్చారు.

Advertisement

Next Story