- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబుకు భారీ షాక్.. బీజేపీ గూటికి మరో టీడీపీ ఎంపీ?
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి గోడ దూకేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి భారీ షాకిచ్చే యోచనలో ఉన్నారు. గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని పలువురు బీజేపీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. నేడో, రేపో ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేశినేని భవన్‌లో చంద్రబాబు, టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని తెలుస్తోంది. కేశినేని భవన్‌లో ఇంతకుముందు చంద్రబాబు, కేశినేని నాని కలిసి ఉన్న ఫోటోలు కనిపించేవి. కానీ ఇప్పుడు రతన్ టాటాతో కేశినేని దిగిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి..
దుమారం రేపుతున్న కేశినేని వ్యవహారం.. చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు