జగన్ గారూ.. దొంగే దొంగ అని అరిచినట్టుంది: కేశినేని

by srinivas |
జగన్ గారూ.. దొంగే దొంగ అని అరిచినట్టుంది: కేశినేని
X

స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల వాయిదా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ రమేశ్‌పై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కులంపై కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేశారు. కులగజ్జి నీకు ఉందని అందరికీ ఆపాదిస్తే… దొంగ అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించింది, దానికేమంటావ్‌? అని ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కి ఈనాడు పత్రిక ‘వాయిదాను ఆపలేం’ కథనాన్ని షేర్ చేశారు.

Tags : vijayawada mp, tdp mp, kesineni nani, tdp, ysrcp, jagan, local body elections

Advertisement

Next Story