'కేసీఆర్‌తో కలిసి జగన్ కొత్త డ్రామా.. వారిద్దరూ తోడు దొంగలే'

by srinivas |   ( Updated:2021-07-01 05:17:19.0  )
tdp mp keshineni nani comments
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఓ పెద్ద డ్రామా అని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లు ఇద్దరూ తోడు దొంగలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇద్దరి మధ్య పరస్పర సహకారం అందరికీ తెలిసిందేనన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలను ముఖ్యమంత్రులు పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో తన ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్‌తో కలిసి జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. సీఎం జగన్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో చెల్లి షర్మిల, ఏపీలో జగన్ ఆడుతున్న డ్రామాలు బయటపడుతున్నాయన్నారు. 80 శాతం పూర్తయిన రాజధాని నిర్మాణాలు వదిలి కరకట్ట అభివృద్ధి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుంందన్నారు. రాష్ట్రప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆస్తిపన్ను పెంచడం దారుణమన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నుల వసూళ్ళలో పెద్ద కుట్ర ఉందని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed