కరోనాతో స్టార్ హీరో మోహన్ లాల్ చనిపోయాడంటూ ఫేక్ న్యూస్

by Shyam |
కరోనాతో స్టార్ హీరో మోహన్ లాల్  చనిపోయాడంటూ ఫేక్ న్యూస్
X

దిశ వెబ్ డెస్క్: క‌రోనా వైర‌స్ కారణంగా దేశ‌మంతా లాక్‌డౌన్ అయ్యింది. కరోనా భయానికి ప్రజలంతా ఇల్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయద్దంటూ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆకతాయిలు వారి చేసే పని చేస్తూనే ఉన్నారు. తాజాగా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా కారణంగా చనిపోయాడంటూ ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేశారు.

కరోనాపై ఇప్పటికే ఎన్నో ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో పోలీసులు ఫేక్ వార్తలపై సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాతో పాటు, జైలు శిక్షకూడా విధిస్తామని హెచ్చరించింది. అయినా ఆకతాయిలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కేర‌ళ‌లో ఇటీవ‌ల ఓ ఆక‌తాయి సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కరోనా సోకి చ‌నిపోయాడంటూ ఓ ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేశాడు. ఈ న్యూస్ చూసిన మోహ‌న్‌లాల్ అభిమానులు ఆగ్ర‌హానికి గురై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Tags: mohan lal, fake news, corona virus, police , rumour

Advertisement

Next Story

Most Viewed