‘రాహుల్ కి పెళ్లి కాలేదు.. కాలేజ్ యువతులు జాగ్రత్త’

by Anukaran |   ( Updated:2021-03-30 20:41:34.0  )
‘రాహుల్ కి పెళ్లి కాలేదు.. కాలేజ్ యువతులు జాగ్రత్త’
X

తిరువనంతపురం : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళకు చెందిన సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ ఎంపీ జోయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకింకా పెళ్లికాలేదని, యువతులు ఆయనతో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. ఇడుక్కిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జార్జ్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ కేవలం గర్ల్స్ కాలేజీలకు మాత్రమే వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి వారు ఎలా వంగాలి (బెండ్)..? ఎలా నిలబడాలి (స్టాండ్)..? అనే విషయాలపై బోధిస్తారు. దయచేసి ఆయన (రాహుల్ గాంధీ) ముందు వంగడం కానీ, నిలబడటం గానీ చేయకండి. అసలే ఆయనకింకా పెళ్లి కాలేదు. జాగ్రత్త..’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఓడిపోతామని తెలిసే సీపీఐ(ఎం) ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story