- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్నీ ఫార్మింగ్ సైకిల్ రైడ్..కేరళవాసి రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్: సైకిల్ అందరికీ తెలిసిన సాధనమే. కానీ పెన్నీ ఫార్మింగ్ సైకిల్ లేదా హై వీలర్ అంటే తెలుసా. ముందు చక్రం చాలా పెద్దదిగా, వెనక చక్రం చిన్నదిగా ఉండే సైకిల్‌నే ‘పెన్నీ ఫార్మింగ్’ అంటారు. వీటిని మనం ఎక్కువగా ‘సర్కస్’లో చూస్తాం. సైకిల్‌కు మొదటి రూపం కూడా ఇదే. 1870-80 కాలంలో వీటి హవా ఉండేది. దీన్ని నడపడం అంతా ఈజీ కాదు. అయితే ఈ హై వీలర్‌ను అవలీలగా నడుపుతూ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు తిరువనంతపురానికి చెందిన పీకే కుమార్.
కూతురుకు సైకిల్ కొనివ్వడానికి వెళ్లిన కుమార్, అక్కడి షాపులో షోకేస్‌గా పెట్టిన పెన్నీ ఫార్మింగ్ సైకిల్‌ను చూసి ముచ్చటపడ్డాడు.
1870ల నాటి ఆ సైకిల్‌ను నడిపేందుకు ఏకంగా మేనేజర్‌కు మెయిల్స్ పెట్టి..చివరకు దాన్ని నడపడమే కాకుండా, దాన్ని సొంతం చేసుకున్నాడు కుమార్. 2019లో మొదలైన ఆయన ఫెన్నీ ఫార్మింగ్ రైడింగ్..రికార్డుల దిశగా సాగుతోంది. కొద్ది వారాల్లోనే ఆ సైకిల్‌ను నేర్చుకున్న కుమార్, ప్రపంచ రికార్డు సాధనే లక్ష్యంగా..సముద్ర ఉపరితలానికి 1,100 మీటర్ల ఎత్తులో ఉన్న కేరళలోని పొన్‌ముడి హిల్ నుంచి కిందకు దిగుతూ హై వీలర్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాడు. అలా కొండ నుంచి కింది వరకు మొత్తంగా 12.7 కిలోమీటర్ల దూరాన్ని కేవలం గంట 13 నిముషాల్లో దిగి ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు కుమార్.
ఒకే నిమిషంలో 226 క్లాక్ వైస్, యాంటి క్లాక్ వైస్ హ్యాండ్ రోటేషన్స్ చేసి గతంలోనే ఓ ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన కుమార్..21.3 కిలోమీటర్లు బ్యాక్ వర్డ్ బ్రెయిన్ సైకిల్(హ్యాండిల్ రైట్‌కు తిప్పితే లెఫ్ట్‌కు వెళుతుంది.. లెఫ్ట్‌కు తిప్పితే రైట్‌కు వెళుతుంది) నడిపి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కుమార్ ఒక్కడే కాదు..కుమార్ భార్య విజయ లక్ష్మి, కూతుర్లు కార్తీక, దేవిక కూడా ‘హ్యాండ్ రోటేషన్స్’లో ప్రపంచ రికార్డ్‌లు నెలకొల్పారు. కుమార్ ఫ్యామిలీ కేరళ వాసుల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్(డయాబెటిస్, కొలెస్ట్రరాల్) రాకుండా ఉండేందుకు రన్నింగ్, హ్యండ్ రోటేషన్స్, సైక్లింగ్ చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.