CM Chandrababu: అరాచకాలను అడ్డుకోవడానికే ఆ పని చేశాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Shiva |
CM Chandrababu: అరాచకాలను అడ్డుకోవడానికే ఆ పని చేశాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ (YCP) అరచకాలను అడ్డుకునునేందుకే తాము ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన (Jansena) పార్టీతో టీడీపీ (TDP) కలిసి పోటీ చేసిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ బాపట్ల (Bapatla) జిల్లా కొత్తగొల్లపాలెం (Kothagollapalem)లో ఆయన పర్యటించి.. ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా రాష్ట్రంలో కార్యకర్తలు నేటికి పార్టీని జెండాను మోస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.

కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే గ్రామాల్లో తానే స్వయంగా పర్యటిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే పెంచిందని.. చెప్పిన మాట ప్రకారం పెన్షన్ రూ.4 వేలు ఇస్తున్నామని తెలిపారు. బటన్లు నొక్కామంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ వైసీపీ (YCP) నాయకులపై మండిపడ్డారు. వాళ్లు ఇచ్చిన బటన్లు అన్నీ.. తాను ఇచ్చే పెన్షన్‌తో సమానమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినంత పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని తెలిపారు. సంక్షేమం అమలు కావడం లేదనేవాళ్లు కాస్త కళ్లు పెట్టి చూడాలన్నారు ఫైర్ అయ్యారు. ఏమిచ్చారని విమర్శించే వాళ్లను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed