- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MEGA DSC: నిరుద్యోగులకు తీపి కబురు.. మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (MEGA DSC)పై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ బాపట్ల (Bapatla) జిల్లా కొత్తగొల్లపాలెం (Kothagollapalem)లో ఆయన పర్యటించి.. ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ (Notification) ఇస్తామని ప్రకటించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యే లోపు అంటే జూన్‌లోగా డీఎస్సీ పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేస్తామని అన్నారు. 2007లోపు పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. తనకు సంకల్పం.. కష్టపడే తత్వం తనదని అన్నారు. రేపు ఏం చయాలో ఇవాళే తాను ఆలోచన చేస్తానని పేర్కొన్నారు. ఇక మే నెలలోనే తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి లబ్ధి చేకూర్చుతామని అన్నారు. అప్పు చేసైనా ఆడబిడ్డలను ఆదుకుంటామని తెలిపారు. అన్నదాత-సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని అన్నారు. అందులో కేంద్రం ఇఛ్చే రూ.వేలకు రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. సమర్ధవంతంగా పాలిసతే.. అసాధ్యమైన పని సుసాధ్యం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.