- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సినేషన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం: వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యతనివ్వడంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు కేటగిరీలోనే ప్రత్యేకంగా కొన్ని వర్గాలకు ప్రాధాన్యతను పినరయి ప్రభుత్వం కల్పిస్తు్న్నది. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా చాలా దేశాలు టీకా వేసుకున్నవారికే తమ దేశంలో అనుమతినిచ్చే నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకుంటున్నవారు అక్కడికి చేరడం కష్టంగా మారుతున్నది. ఈ సమస్యను దృష్టిలోపెట్టుకుని కేరళ ప్రభుత్వం అనుగుణమైన నిర్ణయం తీసుకుంది.
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకుంటున్నవారికి 18 నుంచి 44ఏళ్ల వయసు గ్రూపు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యతనిచ్చినట్టు కొత్త ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దీనితోపాటు మరో పది కేటగిరీలకూ ప్రాధాన్యతనిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆదేశాలనూ జారీ చేశామని వివరించారు. ఇందులో పలు ప్రభుత్వ శాఖల ఫీల్డ్ స్టాఫ్, ఎస్ఎస్ఎల్‌సీ, ఇతర పరీక్షపత్రాలను వ్యాల్యుయేషన్ చేస్తున్న ఉపాధ్యాయులు సహా పలువురున్నారు. ఇది వరకు 32 కేటగిరీల ప్రజలను ప్రాధాన్యత వర్గాల్లో గుర్తించింది. అర్హులైనవారు తమ ప్రాధాన్యతను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని టీకా పొందవచ్చునని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.