- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రాన్స్‌జెండర్స్ చదువులకు స్కాలర్‌షిప్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘ట్రాన్స్‌జెండర్స్’కు కూడా ఈ లోకంలో అందరితో పాటు సమానంగా బతికే హక్కుతో పాటు బేసిక్స్ రైట్స్ కూడా ఉంటాయి. కానీ కేవలం ‘జెండర్’ కారణంగా వారిని చదువులకు, ఉద్యోగావకాశాలకు దూరం పెడుతున్న సందర్భాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే అవకాశాలను అందిపుచ్చుకున్న ‘ట్రాన్స్‌జెండర్స్’ మాత్రం ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం ‘స్పెషల్ స్కాలర్‌షిప్’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బస్సులు, రైళ్లలో.. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు రిజర్వ్‌డ్ సీట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. కాగా పబ్లిక్ బస్సుల్లో కనీసం ఒక సీటును థర్ట్ జెండర్స్‌కు కేటాయిస్తూ కోల్‌కతా ప్రభుత్వం ఇటీవలే ఓ ముందడుగు వేయగా, తాజాగా కేరళ ప్రభుత్వం ట్రాన్‌జెండర్స్‌కు ‘స్పెషల్ స్కాలర్‌షిప్’ స్కీమ్ ప్రకటించడం విశేషం. ఈ స్కీమ్‌లో భాగంగా.. ఏడు నుంచి పదో తరగతి చదువుతున్న ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు పదినెలలకు గాను, ప్రతి నెల ఒక్కో విద్యార్థికి రూ. 1000 ఇవ్వనున్నారు.
ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రతి నెల రూ. 1500, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు చదివే ట్రాన్స్ విద్యార్థులకు ప్రతి నెల రూ. 2000 అందనున్నాయి. మొత్తంగా రూ. 6 లక్షలు ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్‌గా మంజూరు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇదో గొప్ప నిర్ణయమని, దీనివల్ల ట్రాన్స్‌జెండర్ల డ్రాపవుట్స్ తగ్గడమే కాకుండా చదవాలనే కోరిక ఉండి, ఆర్థిక పరిస్థితి బాగా లేని ఎంతోమంది చిన్నారులు ఇక నిశ్చితంగా చదువుకోవచ్చని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న థర్డ్‌జెండర్ జంటలకు కూడా కేరళ చేయూతనివ్వనుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత, ఆరు నెలలకు ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంటే, వెడ్డింగ్ గ్రాంట్ కింద రూ. 30 వేలు అందజేయనుంది. కాగా సోషల్ సిగ్మాను పక్కనపెట్టి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ గుర్తిస్తున్నందుకు కేరళ ప్రభుత్వానికి నెటిజన్లు ఖుదోస్ తెలుపుతున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం 58 శాతం ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్స్ డ్రాపవుట్స్ అవుతున్నట్లు వెల్లడైంది. వారు కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయడం లేదని ఆ సర్వేలో తేలింది. కాగా మనదేశంలో ట్రాన్స్‌జెండర్ పాలసీలు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.