బీజేపీ ఖాతా మూసేస్తాం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Kerala CM
X

తిరువనంతపురం: కేరళలో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిచి ఖాతా తెరిచిందని.. కానీ ప్రస్తుతం దానిని కూడా మూసేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీ ఖాతా తెరిచింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ ఒక్క ఖాతాను కూడా మూసేస్తాం’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ దారుణంగా పడిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల యూపీలో దాడికి గురైన ‘నన్‌’లపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవి సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement

Next Story