కేరళ క్యాబుల్లో.. కరోనాకు అడ్డుగోడగా ఫైబర్ గ్లాస్

by vinod kumar |
కేరళ క్యాబుల్లో.. కరోనాకు అడ్డుగోడగా ఫైబర్ గ్లాస్
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా ప్రభావం లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మళ్లీ మామూలు జీవితాల్లోకి ప్రజలు వస్తున్నారు. దుకాణాలు కూడా తెరవడంతో.. రోడ్లపై రద్దీ పెరిగింది. అయితే కరోనా కారణంగా ప్రజలంతా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేరళ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే.. కేర్ ఫుల్ గా వారీ డే టూ డే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ టైమ్ లో కేరళ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి.. కరోనాకు అడ్డుకట్ట వేయడానికి క్యాబ్ డ్రైవర్ల కు, ప్యాసింజర్ కు మధ్యలో ఫైబర్ గ్లాస్ పెట్టాలని సూచనలిచ్చింది.

సాధారణంగా క్యాబుల్లో రకరకాల వ్యక్తులను, విభిన్న ప్రాంతాల నుంచి డ్రైవర్లు తీసుకెళుతుంటారు. కరోనా టైమ్ లో వారి ప్రయాణికుల్లో ఎవరూ కరోనాతో బాధపడుతున్నారో తెలియదు కాబట్టి వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతో క్యాబుల్లో ప్రయానించే ఇద్దరికీ కూడా రక్షణగా ఉండటానికి వారి మధ్య ఫైబర్ గ్లాస్ పెడుతున్నారు. ఫైబర్ గ్లాస్ వాడటంతో .. కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్‌ వ్యాపించకుండా ఉంటుంది. సంవత్సరం పాటు విధిగా అన్నీ క్యాబుల్లోనూ ఈ తరహా ఫైబర్ గ్లాసు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు ఎక్కేముందు ప్రయాణికులు కచ్చితంగా శానిటైజర్ రాసుకోవాలనే నిబంధన కూడా ఉంది. మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి. అంతేకాదు డ్రైవర్లు హ్యాండ్ గ్లౌవ్స్ వేసుకోవాలి. కారు డోర్ డ్రైవర్లే తీయాలి. ప్రయాణికులు పలు ప్రదేశాల నుంచి వస్తారు కాబట్టి .. ఎవరికైనా కరోనా ఉంటే.. వారి ద్వారా కరోనా వైరస్ కార్ల డోర్ హ్యాండిల్స్ పై ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల డ్రైవర్లే ఆ బాధ్యత నిర్వర్తించాలి. కాష్ లెస్ పేమెంట్ మాత్రమే చేయాలి. ప్రతి ప్రయాణికుడు దిగిన తర్వాత ఆ సీటును శానిటైజ్ చేయాలి. సెడాన్ వెహికల్ లో ఇద్దరు, ఎమ్ పీ వీ వంటి హెవీ వెహికల్ లో నలుగురు మాత్రమే కూర్చోవాలి. ముందు సీట్లో ఎవరూ కూర్చోడానికి వీలు లేదు.

Advertisement

Next Story

Most Viewed