ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభం

by Shyam |
ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభం
X

దిశ, సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కోసం అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయినట్టు ప్రిన్సిపల్ మార్కండేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యాలయంలో ఒకటో తరగతిలో 40 సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాదదికరోనా నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలయ్యిందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ షెడ్యూల్ ప్రకారం జులై 20 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 7 వరకు జరుగుతుందని తెలిపారు. అడ్మిషన్లు కావలసినవారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story