మోసపోవడం ఎలా?నన్ను చూసి నేర్చుకోండంటున్న సీఎం కూతురు

by Anukaran |   ( Updated:2021-02-08 21:55:48.0  )
మోసపోవడం ఎలా?నన్ను చూసి నేర్చుకోండంటున్న సీఎం కూతురు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నెత్తినోరు బాదుకొని మరీ చెబుతున్నారు. కానీ కొందరు ఆ జాగ్రత్తల్ని చెవికెక్కించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు.

టెక్నాలజీపై అవగాహనలేని వారంటే తెలియక పొరపాటు చేస్తుంటారు. కానీ టెక్నాలజీపై అపార అనుభవంతో పాటు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ఆన్ లైన్‌లో మోసపోవడం విచిత్రంగా మారింది. పై పెచ్చు ఆ కేటుగాడు సదరు బాధితురాలికి చెప్పి మరీ అకౌంట్ లో ఉన్న డబ్బును మాయం చేశాడు. తీరా జరిగింది తెలుసుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఇంట్లో ఉన్న సోఫాను ఆన్ లైన్ అమ్మకానికి పెట్టింది. అయితే ఓ కేటుగాడు హర్షిత పెట్టిన సోఫా సెట్ బాగుందని, తాను తీసుకుంటానని నమ్మించాడు. సోఫా సెట్ తీసుకునే ఒప్పందంలో భాగంగా కొంత మొత్తాన్ని అకౌంట్ ను పంపిస్తానని, అయితే ముందు తాను పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అతగాడి మాయమాటల్ని నమ్మిన హర్షిత చెప్పినట్లు చేసింది. అంతే ఆమె అకౌంట్ లో ఉన్న 20వేలు మాయమయ్యాయి. అదేంటీ నా అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మీఅకౌంట్ కు ఎలా ట్రాన్స్ ఫర్ అయ్యాయని ప్రశ్నించగా.., తాను పొరపాటుగా వేరే క్యూఆర్ కోడ్ను పంపానని, ఇప్పుడు మరో క్యూఆర్ కోడ్ లింక్ పంపిస్తున్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పాడు. నిందితుడు మాయమాటల్ని నమ్మిన హర్షిత మరోసారి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడంతో అకౌంట్ లో ఉన్న రూ.14వేలు మాయమయ్యాయి. దీంతో కేటుగాడి చేతిలో మోసపోయానని గ్రహించిన హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed