మహేశ్ సరసన మహానటి?

by Shyam |   ( Updated:2020-06-10 08:33:55.0  )
మహేశ్ సరసన మహానటి?
X

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘సర్కార్ వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించబోతున్న మహేశ్ సరసన నటించే హీరోయిన్ గురించి ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ముందుగా కియారా అద్వానీ, ఆ తర్వాత సాయి ముంజ్రేకర్‌ మహేశ్‌తో జతకడుతుందని వార్తలు రాగా.. ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్.. మహేశ్ సరసన నటించబోతున్నదని వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి ప్రాజెక్ట్ ఫైనల్ చేసిందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తుండగా.. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

కీర్తి నటించిన పెంగ్విన్ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోగా కీర్తి కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ యాడ్ అయినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Next Story