‘సర్కారు వారి పాట’ కోసం దుబాయికి కీర్తి

by Shyam |
‘సర్కారు వారి పాట’ కోసం దుబాయికి కీర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇది మహేశ్‌కి 27వ సినిమా కాగా, ఇందులో మహేశ్ సరసన ముద్దుగుమ్మ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ త్వ‌ర‌లో దుబాయిలో షురూ కానుంది. ఇప్ప‌టికే మ‌హేశ్‌ త‌న వైఫ్ న‌మ్ర‌త‌, గౌత‌మ్, సితార‌తో దుబాయికి వెళ్లిపోయాడు. మూవీ షూటింగ్ కీర్తిసురేశ్ కూడా జాయిన్ కావాల్సి ఉండగా.. దుబాయికి పయనమవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పకనే చెప్పింది కీర్తి.

https://twitter.com/KeerthyOfficial/status/1352469858647121922?s=20

త‌న క్యూటీ పెట్‌ను వ‌దిలిపెట్టి టౌన్ దాటి వెళ్ల‌డం చాలా క‌ష్టంగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. నీకు గుడ్‌బై చెప్ప‌డం క‌ష్టం..ప‌ని నిమిత్తం టౌన్ దాటి వెళ్లే ప్ర‌తీ సారి తన హృదయం బ‌ద్ద‌లవుతుందని, తాను తిరిగొచ్చిన త‌ర్వాత గ‌ట్టిగా కౌగించుకునేంత‌వ‌ర‌కు..బ‌రువెక్కిన హృద‌యంతో నిన్ను చాలా మిస్స‌వుతున్నా బేబి.. నీతో ఉన్న ప్రతి రోజూ హ‌గ్గింగ్ డే..హ‌గ్గింగ్ ఫేస్..దుబాయ్‌కు మ‌ళ్లీ వ‌స్తున్నా..నంటూ కీర్తితో తన పెట్‌తో దిగిన ఫొటో పెట్టి ట్వీట్ చేసింది. కీర్తి త‌న పెట్‌ను ముద్దాడుతూ పెట్టిన ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Advertisement

Next Story